కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saripodhaa Sanivaaram: మళ్లీ యాక్షన్‌లోకి నేచురల్ స్టార్..

ABN, Publish Date - Dec 27 , 2023 | 07:04 PM

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. బుధవారం నుండి హైదరాబాద్‌లో ఓ లెంగ్తీ షెడ్యూల్‌ను ప్రారంభించుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Saripodhaa Sanivaaram Shooting Spot

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment)పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి గత నెలలో ఒక షెడ్యూల్ పూర్తి కాగా, బుధవారం (డిసెంబర్ 27) నుండి యూనిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.

ఈ షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. ఓ పిక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లెన్తీ షెడ్యూల్‌లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నారు. నాని, ఇతర కీలక తారాగణం షూటింగ్‌లో పాల్గొంటారు. తాజాగా విడుదల చేసిన పిక్‌లో ఫేస్‌‌లు క్లారిటీగా లేవు కానీ.. నాని (Nani), ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఇందులో కనిపిస్తున్నారు.


ఇంతకు ముందు అన్‌చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని ఈ సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్ జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు

**************************

*Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్

***************************

*Sriya Reddy: ‘సలార్’ పార్ట్ 1లో ఏం చూశారు.. అసలు విషయం పార్ట్ 2లో..

************************

Updated Date - Dec 27 , 2023 | 07:31 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!