సమయం చేసిన సాయం

ABN , First Publish Date - 2023-09-17T02:15:05+05:30 IST

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ నాయిక. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు...

సమయం చేసిన సాయం

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ నాయిక. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘సమయమా’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు అందించారు. అనంత శ్రీరామ్‌ రాశారు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 21న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ‘‘భావోద్వేగాలే బలంగా సాగే కథ ఇది. నాని నటన, మృణాల్‌ గ్లామర్‌ ప్రధాన ఆకర్షణ. తండ్రీ కూతుర్ల అనుబంధం ఆకట్టుకొంటుంద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-09-17T02:15:05+05:30 IST