సంగీత ప్రధానంగా సగిలేటి కథ

ABN , First Publish Date - 2023-08-20T02:03:22+05:30 IST

హీరో నవదీప్‌ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు...

సంగీత ప్రధానంగా సగిలేటి కథ

హీరో నవదీప్‌ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. దేవీ ప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్‌లో విడుదలవుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. తాజాగా ఈ చిత్రంలోని తొలిగీతం ‘ఏదో జరిగే’ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. నవదీప్‌ అన్న సహకారం వల్లే ఒక మంచి సినిమా తీయగలిగామని దర ్శకుడు చెప్పారు. ‘‘సగిలేటి కథ’ అందమైన సంగీత భరిత చిత్రం. అన్ని పాటలు బాగున్నాయి’ అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-08-20T02:03:22+05:30 IST