Samantha struggled a lot : సమంత చాలా కష్టపడ్డారు

ABN , First Publish Date - 2023-08-17T04:13:04+05:30 IST

విజయ్‌ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ చిత్రం సంగీత విభావరి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలోని గీతాలను గాయకులు జావేద్‌ అలీ, సిధ్‌ శ్రీరామ్‌, మంజూష, చిన్మయి, హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఆలపించారు...

Samantha struggled a lot : సమంత చాలా కష్టపడ్డారు

విజయ్‌ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ చిత్రం సంగీత విభావరి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలోని గీతాలను గాయకులు జావేద్‌ అలీ, సిధ్‌ శ్రీరామ్‌, మంజూష, చిన్మయి, హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఆలపించారు. ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్‌కు విజయ్‌ దేవరకొండ, సమంత లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగా ప్రేక్షకులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. సమంత మాట్లాడుతూ‘నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీ ఖుషి. మీరు చూపించే ప్రేమకోసం ఆరోగ్యంగా తిరిగొస్తాను. బ్లాక్‌బస్టర్‌ ఇస్తాను’ అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘మీ అందరికీ ఒక సూపర్‌హిట్‌ బాకీ ఉన్నా. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ ఆమెకు ఆరోగ్యం బాగోలేదు. అయినా అభిమానుల కోసం ఈ కార్యక్రమానికి వచ్చారు’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘ఖుషి’ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ కథను తెరకెక్కించేందుకు నాకు దొరికిన డైమండ్స్‌ విజయ్‌, సమంత’ అన్నారు. చిత్ర నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘సమంత మా ‘మైత్రీ’ సంస్థలో చే సిన ప్రతి సినిమా హిట్టయింది. ‘ఖుషి’ కూడా పెద్ద హిట్‌ అవబోతోంది. సెప్టెంబర్‌ 1న థియేటర్లలో మా సినిమా చూడండి’ అని ప్రేక్షకులను కోరారు.

Updated Date - 2023-08-17T04:13:04+05:30 IST