సమంత స్టోన్‌బాత్‌

ABN , First Publish Date - 2023-11-09T02:30:03+05:30 IST

ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సమంత తన ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. మయోసైటిస్‌ నుంచి కోలుకునేందుకు పలు రకాల వైద్య పద్ధతులను అనుసరిస్తున్నారు...

సమంత స్టోన్‌బాత్‌

ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సమంత తన ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. మయోసైటిస్‌ నుంచి కోలుకునేందుకు పలు రకాల వైద్య పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె భూటాన్‌లో డాట్‌ షో అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. దీన్నే హాట్‌స్టోన్‌బాత్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సమంత సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. హాట్‌స్టోన్‌బాత్‌ ఆచరించే విధానం గురించి వివరిస్తూ ‘నదుల్లోని రాళ్లను ఎర్రగా కాల్చి వాటిని స్నానం చేసే నీటిలో వేస్తారు. వాటిలో ఉండే మినరల్స్‌ ఆ నీటిలోకి చేరతాయి. కెంపా అనే వన మూలికలను కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల శారీరక అలసట, కడుపునొప్పి, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఎముకలు ఽగట్టిబడతాయి’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-09T02:30:05+05:30 IST