సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గాల్లో ఎగురుతూ సమంత ఫీట్లు

ABN, First Publish Date - 2023-04-30T01:20:24+05:30

ఓ పాత్ర నచ్చితే దాని కోసం ఎంత కష్టమైనా భరించడానికి హీరోయిన్లు రెడీగా ఉంటారు. సమంత ఈ కోవలోకే వస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ పాత్ర నచ్చితే దాని కోసం ఎంత కష్టమైనా భరించడానికి హీరోయిన్లు రెడీగా ఉంటారు. సమంత ఈ కోవలోకే వస్తుంది. ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’ కోసం సమంత చేసిన సాహసాలు చూశాం. ‘శాకుంతలం’ కోసం బాగా కష్టపడింది. ఇప్పుడు మరోసారి గాల్లో ఎగురుతూ, యాక్షన్‌ ఫీట్లు చేస్తోంది సమంత. ఇటీవల ఓ కమర్షియల్‌ యాడ్‌ షూటింగ్‌లో పాలుపంచుకొంది సమంత. వాటికి సంబంధించిన చిత్రాల్ని అభిమానులతో పంచుకొంది. ఓ షాట్‌ కోసం.. రోప్‌ సహాయంతో గాల్లో ఎగురుతూ.. ఆశ్చర్యపరిచింది. ఇటీవల సమంత నటించిన ‘శాకుంతలం’ విడుదలైంది. అయితే దానికి సరైన స్పందన రాలేదు. ఈ సినిమాపై శామ్‌ పెట్టుకొన్న ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. అయితే ఈ ఫలితాన్ని పక్కన పెట్టి మళ్లీ వర్క్‌ మూడ్‌లో పడిపోయింది సమంత. ప్రస్తుతం ‘సిటాడెల్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అందులోనూ సమంత భారీ స్థాయిలో యాక్షన్‌ సీన్లు చేయబోతోందట.

Updated Date - 2023-04-30T01:20:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!