సమంత కోసం ఓ గుడి

ABN , First Publish Date - 2023-04-27T00:02:09+05:30 IST

తెలుగు సినిమాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈతరం కథానాయికల్లో సమంత ముందుంటారు.

సమంత కోసం ఓ గుడి

తెలుగు సినిమాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈతరం కథానాయికల్లో సమంత ముందుంటారు. అయితే చాలామంది అగ్ర కథానాయికలకు దక్కని అరుదైన ఘనత సమంతకు దక్కింది. తమ అభిమాన తార సమంతకు గుడికట్టి గుండెల్లో పెట్టుకున్నాడు ఓ అభిమాని. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్‌, సమంతకు పెద్ద అభిమాని. ఆమె నటనే కాదు ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంత గొప్ప మనసు సందీప్‌కు బాగా నచ్చాయి. దాంతో సమంతకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. తన ఇంటి ప్రాంగణంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. నిర్మాణం పనులు తుదిదశలో ఉన్నాయి. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆలయాన్ని ఈ నెల 28న ప్రారంభిస్తున్నట్లు సందీప్‌ తెలిపారు.

Updated Date - 2023-04-27T00:02:09+05:30 IST