వేసవికి సామజవరగమనా

ABN , First Publish Date - 2023-03-19T00:44:54+05:30 IST

డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమలో తొలి అడుగులు వేసి, సహ నిర్మాతగా సక్సెస్‌ చవిచూశారు రాజేశ్‌ దండా. హాస్య మూవీస్‌ బేనర్‌ స్థాపించి నిర్మాతగా మారిన ఆయన శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

వేసవికి సామజవరగమనా

డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమలో తొలి అడుగులు వేసి, సహ నిర్మాతగా సక్సెస్‌ చవిచూశారు రాజేశ్‌ దండా. హాస్య మూవీస్‌ బేనర్‌ స్థాపించి నిర్మాతగా మారిన ఆయన శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా రాజేశ్‌ దండా మీడియాతో మాట్లాడుతూ... ‘సామజవరగమనా’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. వేసవిలో విడుదల చేస్తున్నాం. శ్రీ విష్ణు ఇప్పటిదాకా ఈ తరహా చిత్రం చేయలేదు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘నువ్వు లేక నేను లేను’ తరహాలో కామెడీ ఉంటుంది. సందీప్‌ కిషన్‌తో ‘ఊరుపేరు భైరవకోన’ అనే చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నాం. వి. ఐ ఆనంద్‌ దర్శకుడు. శ్రీవిష్ణు, నరేశ్‌తో సినిమాలు చేయబోతున్నాం. సాయిధరమ్‌తేజ్‌, నాంది దర్శకుడు విజయ్‌ కనకమేడలతో సినిమాలు చేయాలనేది నా కోరిక’ అన్నారు.

Updated Date - 2023-03-19T00:44:54+05:30 IST