ప్రేమికుల కోసం సల్మాన్ పాట
ABN , First Publish Date - 2023-02-14T03:13:26+05:30 IST
సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ లోని రొమాంటిక్ సాంగ్ ‘ నాయియో లడ్గా’ ను సోమవారం...

సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ లోని రొమాంటిక్ సాంగ్ ‘ నాయియో లడ్గా’ ను సోమవారం విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సం సందర్భంగా ఈ పాటను విడుదల చేస్తున్నట్లు సినిమా టీమ్ ప్రకటించింది. లేహ్, లడఖ్ వంటి అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించినట్లు మేకర్స్ చెప్పారు. సినిమాలోని మొదటి పాట ఇదే. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21న ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జగపతిబాబు, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్‌జీ దర్శకుడు.