గార్డియన్స్‌కు సల్మాన్ ప్రచారం
ABN , First Publish Date - 2023-05-03T01:52:23+05:30 IST
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ రూపొందించిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ 3’ చిత్రం మే 5న విడుదలవుతోంది. ఇండియాలో పలు భారతీయ భాషల్లో విడుదలవుతోంది...

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ రూపొందించిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ 3’ చిత్రం మే 5న విడుదలవుతోంది. ఇండియాలో పలు భారతీయ భాషల్లో విడుదలవుతోంది. చిత్రబృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ 3’ ప్రచారం కోసం ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇందులో ‘గార్డియన్స్...’ చిత్రంలోని గ్రూట్ క్యారెక్టర్‌ను అనుకరిస్తూ సల్మాన్‌ఖాన్ చేసిన కామెడీ, మీడియా ప్రశ్నలకు ‘ఐ యామ్ సల్మాన్’ అంటూ గ్రూట్ స్టైల్లో ఆయన బదులిచ్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.