సలార్‌ విందు సిద్ధమైంది

ABN , First Publish Date - 2023-08-26T05:21:37+05:30 IST

ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘సలార్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సెప్టెంబరు 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు...

సలార్‌ విందు సిద్ధమైంది

ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘సలార్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సెప్టెంబరు 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 7న ట్రైలర్‌ విడుదల చేస్తారని సమాచారం. షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రైలర్‌లో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారని, దాదాపు 70 శాతం బడ్జెట్‌ వాటికే కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. ప్రభాస్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశారని, ఓ యాక్షన్‌ సన్నివేశంలో ఇద్దరు ప్రభా్‌సలూ ఒకేసారి ప్రత్యక్షం అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ‘సలార్‌’పై అంచనాలు రెట్టింపయ్యాయి.

Updated Date - 2023-08-26T05:22:17+05:30 IST