గాంజా శంకర్‌గా సాయితేజ్
ABN , First Publish Date - 2023-10-16T01:57:46+05:30 IST
సంపత్‌నంది దర్శకత్వంలో సాయితేజ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం సాయితేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం...

సంపత్‌నంది దర్శకత్వంలో సాయితేజ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం సాయితేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘గాంజా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తన కెరీర్‌లో తొలిసారి మాస్ రోల్‌లో కనిపించిన సాయితేజ్ ఆద్యంతం ఆకట్టుకున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి