సైంధవ్‌ పోరాటం

ABN , First Publish Date - 2023-08-14T00:53:34+05:30 IST

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌. సిద్దిఖీ, శ్రద్దా శ్రీనాథ్‌, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

సైంధవ్‌ పోరాటం

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌. సిద్దిఖీ, శ్రద్దా శ్రీనాథ్‌, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరించారు. వెంకటేశ్‌, నవాజుద్దీన్‌ తదితరులపై 16 రోజుల పాటు తెరకెక్కించిన ఈ భారీ పోరాట దృశ్యానికి రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వం వహించారు. ‘‘వెంకటేశ్‌ 75వ చిత్రమిది. అందుకే ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవ్వాలన్న ఆకాంక్షతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నాం. క్లైమాక్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిసెంబరు 22న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’ని నిర్మాత తెలిపారు. సంగీతం: సంతోష్‌ నారాయణ్‌.

Updated Date - 2023-08-14T00:53:34+05:30 IST