పండగలాంటి సినిమా సైంధవ్
ABN , First Publish Date - 2023-11-22T00:24:00+05:30 IST
వెంకటేశ్ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ బోయినపల్లి నిర్మాత...

వెంకటేశ్ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ బోయినపల్లి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల అవుతోంది. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘రాంగ్ యూసేజ్’ అనే పాటని ఆవిష్కరించారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన గీతమిది. చంద్రబోస్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించాం. సంక్రాంతికి విడుదల అవుతోంది. నిజమైన పండగలా ఉంటుంది. డబ్బు, మనుషులు, స్నేహం గురించి ‘రాంగ్ యూసేజ్’ పాటలో చాలా బాగా చెప్పారు. అర్థవంతమైన సాహిత్యం అందించారు చంద్రబోస్. ఈ పాట అందరికీ నచ్చుతుంద’’న్నారు. ‘‘నేను తీసిన హిట్ 1, హిట్ 2 అందరికీ నచ్చాయి. నా సినిమాల్లో బెస్ట్ వర్క్ అంటే ‘సైంధవ్’ అని చెబుతాను. అంత బాగా వచ్చింది. వెంకటేశ్ గారి 75వ సినిమా ఎలా ఉండాలని కోరుకొంటారో, ఈ సినిమా అలానే ఉంటుంద’’న్నారు దర్శకుడు. ‘‘సైంధవ్ ఓ అద్భుతమైన సినిమా. వెంకటేశ్‌ని కొత్తగా చూస్తార’’ని నిర్మాత చెప్పారు.