లంకలో సైంధవ్‌

ABN , First Publish Date - 2023-09-11T01:56:07+05:30 IST

వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఆదివారం శ్రీలంకలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించినట్లు చిత్రబృందం తెలిపింది....

లంకలో సైంధవ్‌

వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఆదివారం శ్రీలంకలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించినట్లు చిత్రబృందం తెలిపింది. వెంకటేశ్‌ సహా ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటోంది. టాకీపార్ట్‌తో పాటు పోరాట ఘట్టాలను, ఒక పాటను అక్కడ చిత్రీకరించనున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఈ చిత్రంలో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: సంతోష్‌ నారాయణ్‌

Updated Date - 2023-09-11T01:56:07+05:30 IST