సైమా వేడుకలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

ABN , First Publish Date - 2023-09-04T00:27:30+05:30 IST

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరుగనుంది..

సైమా వేడుకలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరుగనుంది. ఇందుకు సంబంధించి ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌, శశాంక్‌ శ్రీ వాస్తవ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రానా మాట్లాడుతూ ‘దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ కలసి ఆనందంగా జరుపుకొనే వేడుక సైమా. 11 ఏళ్లుగా ఈ వేడుకల్లో నేను భాగం అవుతున్నప్పటికీ ఇప్పుడే మొదలు పెట్టిన ఉత్సాహం, ఆనందం ఉంది. గ్లోబల్‌ ఫ్లాట్‌ ఫామ్‌కి చేరుకోవడానికి సైమా గొప్ప వేదిక’ అన్నారు. లెజండరీ ఆర్టిస్టులతో కలసి సైమా వేదికను పంచుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుందని నిధి అగర్వాల్‌ చెప్పారు. సైమా వేడుకల్లో పాల్గొనడం తనకు ఇదే మొదటి సారి అని మీనాక్షి చౌదరి తెలిపారు. సినిమాను ఒక పండగలా జరుపుకొనే వేడుక ఇదని ఆమె అన్నారు. సైమా వేడుకలకు కౌంట్‌ డౌన్‌ మొదలయిందనీ ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌ చెప్పారు.

Updated Date - 2023-09-04T00:27:30+05:30 IST