సహస్ర పిలుస్తోంది...!

ABN , First Publish Date - 2023-11-21T00:15:28+05:30 IST

బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకొన్న ‘సుడిగాలి’ సుధీర్‌.. ఇప్పుడు వెండి తెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు....

సహస్ర పిలుస్తోంది...!

బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకొన్న ‘సుడిగాలి’ సుధీర్‌.. ఇప్పుడు వెండి తెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. డాలీషా కథానాయిక. అరుణ్‌ విక్కిరాలా దర్శకుడు. విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలు. డిసెంబరు 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని తప్పకుండా అందుకొంటాం. కథాబలం ఉన్న చిత్రమిది. ఈ సినిమాతో సుధీర్‌కి ఓ సరికొత్త ఇమేజ్‌ వస్తుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-11-21T00:15:31+05:30 IST