పోలీస్‌ పాత్రలో రుహానీ శర్మ

ABN , First Publish Date - 2023-01-19T01:15:29+05:30 IST

‘చిలసౌ’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి, ‘హిట్‌’ సినిమాతో గుర్తింపు పొందిన రుహానీ శర్మ తాజా చిత్రం ‘హర్‌’...

పోలీస్‌ పాత్రలో రుహానీ శర్మ

‘చిలసౌ’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి, ‘హిట్‌’ సినిమాతో గుర్తింపు పొందిన రుహానీ శర్మ తాజా చిత్రం ‘హర్‌’. ఇప్పటి వరకూ సాఫ్ట్‌ రోల్స్‌ చేసిన ఆమె తొలిసారిగా ఫిమేల్‌ లీడ్‌ చేస్తూ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారు. ‘హర్‌’ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. దర్శకుడు శ్రీధర్‌ స్వరాఘవ్‌ రూపొందించిన చిత్రం ఇది. యాక్షన్‌ పాక్డ్‌గా ఉన్న ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపధ్యంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మాతలు.

Updated Date - 2023-01-19T01:15:29+05:30 IST