RRR team gets place in Oscar committee : ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు ఆస్కార్ కమిటీలో చోటు
ABN , First Publish Date - 2023-06-30T02:20:39+05:30 IST
వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ పనులు అప్పుడే మొదలయ్యాయి. గత ఏడాది 10, 665 మంది సభ్యులు కమిటీలో ఉండగా ఈ ఏడాది కొత్తగా మరో 368 మంధి సభ్యులకు అవకాశం కల్పించిన ద మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడెమీ. ఆ లిస్ట్‌ను ప్రకటించింది...
వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ పనులు అప్పుడే మొదలయ్యాయి. గత ఏడాది 10, 665 మంది సభ్యులు కమిటీలో ఉండగా ఈ ఏడాది కొత్తగా మరో 368 మంధి సభ్యులకు అవకాశం కల్పించిన ద మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడెమీ. ఆ లిస్ట్‌ను ప్రకటించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా ఆ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్, గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఇలా సభ్యత్వం కోసం ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. అయితే చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు ఇందులో లేదు. వీరు కాకుండా దర్శకుడు మణిరత్నం, కరణ్ జోహార్ , భారతదేశం నుంచి ఆస్కార్‌కు అఫిషియల్ ఎంట్రీగా వెళ్లిన ‘చల్లో షో’ నిర్మాత సిద్దార్థ రాయ్ కపూర్, ఆస్కార్ నామినేషన్ పొందిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీద్స్’ దర్శకుడు షౌణక్ సేన్ కూడా ఆస్కార్ నుంచి ఆహ్వానం అందుకొన్నారు. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర దర్శకుడు రాజమౌళి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌లోని ఆరుగురికి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం రావడం చాలా గర్వంగా, ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భారత చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ఆహ్వానం అందుకొన్న వారికి అభినందనలు’ అని రాజమౌళి పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫ్యామిలీకి ఇది చాలా గర్వ కారణమని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. 96వ ఆస్కార్ వేడుక వచ్చే ఏడాది మార్చి 10న జరుగుతుంది.