Bubblegum: సుమను సక్సెస్ పార్టీకి సిద్ధం కావాలంటున్నారు..

ABN , First Publish Date - 2023-12-15T18:41:20+05:30 IST

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో యంగ్ హీరో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘బబుల్‌గమ్’. డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, రానా దగ్గుబాటి సమక్షంలో విడుదల చేశారు.

Bubblegum: సుమను సక్సెస్ పార్టీకి సిద్ధం కావాలంటున్నారు..
Bubblegum Movie Trailer Launch

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) దర్శకత్వంలో యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘బబుల్‌గమ్’ (Bubblegum). డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా ట్రైలర్ విషయానికి వస్తే.. “నా నసీబ్‌లో ఏం రాసి పెట్టుందో నాకు తెల్వదు... కానీ నచ్చినట్లు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అదీ ఇజ్జత్ అయినా... ఔకాత్ అయినా’’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్‌లో ‘బబుల్‌గమ్‌’ కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు. మ్యూజిక్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు డీజే రోషన్ కనకాల. మానస చౌదరిని కలిసిన తర్వాత అతను జీవితం మరో మలుపు తిరుగుతుంది. కొన్ని అనూహ్య కారణాల వలన ప్రేమ విఫలం కావడంతో తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నాడు రోషన్. తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని, ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకర్షిస్తాయి. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ తరం యువతకు తగ్గ కంటెంట్‌ని బాగా ప్రజంట్ చేశారు. రోషన్ కనకాల బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, డైలాగ్ డిక్షన్, పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. అతనిలో ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్ కనిపించింది. మానస చౌదరి (Maanasa Choudhari) చాలా అందంగా కనిపించింది. చక్కని నటనతో ఆకట్టుకుంది. సురేష్ రగుతు కెమెరా పనితనం, శ్రీచరణ్ పాకాల సంగీతం హైలెట్ అనేలా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ అంచనాలను పెంచేసిందనే చెప్పుకోవాలి. (Bubblegum Trailer Talk)


Suma.jpg

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) మాట్లాడుతూ.. సుమ (Suma Kanakala) ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. బబుల్‌గమ్‌ ట్రైలర్‌లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది. బబుల్‌గమ్‌ మెల్లగా ఉబ్బి ఉబ్బి పెద్దగా పేలుతుంది. ఈ సినిమా టాక్ కూడా మెల్లగా స్టార్ట్ అయి సూపర్ హిట్ టాక్‌తో ఎండ్ అవుతుంది. రోషన్, మానస కెమిస్ట్రీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా నాకు సొంత కుటుంబం లాంటింది. వారి ద్వారా విడుదలైన సినిమాలన్నీ అద్భుతంగా ఆడాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సుమ, రాజీవ్ కనకాలగారికి డిసెంబర్ 29 ఒక ప్రౌడ్ మూమెంట్. ట్రైలర్ అద్భుతంగా వుంది. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. యూత్ ట్రెండ్‌లో మంచి కంటెంట్ వదిలితే ప్రేక్షకులు దాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళుతున్నారు. బబుల్‌గమ్‌‌లో యూత్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వున్నట్లు తెలుస్తోంది. చాలా మంచి లైవ్ స్టొరీ కనిపిస్తోంది. రవికాంత్ గత చిత్రాలు కూడా చూశాను. ఈ చిత్రాన్ని కూడా చాలా అద్భుతంగా తీశారు. రోషన్ చాలా యూనిక్‌గా వున్నాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సుమ గారి స్టయిల్‌లో సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేయాలి. మళ్ళీ సక్సెస్ మీట్‌లో కలుద్దామని అన్నారు.

రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. సుమ‌గారు మా జీవితాల్లో భాగమైపోయారు. నిరంతం ప్రోత్సహిస్తూ వుంటారు. రోషన్‌కి అందరి ప్రేమ, అభిమానం దక్కాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రవికాంత్ కథలు కొత్తగా వుంటాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

***********************************

Updated Date - 2023-12-15T18:55:51+05:30 IST