రొమాంటిక్ 'నైషధం'

ABN , First Publish Date - 2023-09-12T01:06:55+05:30 IST

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. అభిషేక్‌ నామా దర్శక నిర్మాత...

రొమాంటిక్ 'నైషధం'

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. అభిషేక్‌ నామా దర్శక నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. సోమవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా సంయుక్త ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నైషధ పాత్రలో సంయుక్త కనిపించనుంది. ఈ గెటప్‌లో సంయుక్త సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చింది. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. నవంబరు 24న విడుదల చేస్తున్నాం. ఎవరికీ అంతుచిక్కని ఓ రహస్యాన్ని కనుగొనే ఏజెంట్‌గా కల్యాణ్‌ రామ్‌ నటన ఆకట్టుకొంటుంద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

Updated Date - 2023-09-12T01:06:55+05:30 IST