రాకింగ్‌ రాకేశ్‌ హీరోగా...

ABN , First Publish Date - 2023-08-30T04:48:16+05:30 IST

‘జబర్దస్త్‌’ షోతో పాపులర్‌ అయిన హాస్యనటుడు రాకింగ్‌ రాకేశ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనన్య కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు..

రాకింగ్‌ రాకేశ్‌ హీరోగా...

‘జబర్దస్త్‌’ షోతో పాపులర్‌ అయిన హాస్యనటుడు రాకింగ్‌ రాకేశ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనన్య కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. జయలక్ష్మి సాయికుమార్‌ నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి తెలంగాణ పార్లమెంట్‌ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ క్లాప్‌నిచ్చారు. రోజా స్విచ్చాన్‌ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మట్టివాసన కలిగిన స్వచ్చమైన చిత్రమిది. రాకేశ్‌కి మంచి పేరు తీసుకొస్తుంది. తనదైన కామెడీ కూడా ఉంటుంది. ప్రతిభావంతులైన టీమ్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నార’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: చరణ్‌ - అర్జున్‌.

Updated Date - 2023-08-30T04:48:16+05:30 IST