పోలీసు విచారణకు హాజరైన రిషబ్‌శెట్టి
ABN, First Publish Date - 2023-02-13T00:42:59+05:30
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి కేరళ కొయికోడ్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి కేరళ కొయికోడ్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు రిషబ్‌శెట్టితో పాటు ‘కాంతార’ నిర్మాత విజయ్ కిరగందూరు వెళ్లారు. ‘వరాహ రూపం’ పాటకు సంబంధించి కాపీరైట్ హక్కులు ఉల్లంఘించారంటూ కేరళలోని తైకుడం బ్రిడ్జ్ ఆల్బమ్ బ్యాండ్ ఆరోపించింది. దాంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కొయికోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా రిషబ్, విజయ్‌లను అధికారులు విచారించారు. సోమవారం ఉదయం మరోసారి విచారణకు హాజరు కావాలని కేరళ పోలీసులు సూచించారు. కన్నడిగులు అత్యంత ఇష్టపడిన ‘వరాహరూపం’ పాటను 2015లో కేరళలో విడుదలైన తైకుడం బ్రిడ్జ్ ఆల్బమ్ బ్యాండ్ ‘నవరస’ నుంచి కాపీ చేశారని ఆరోపించారు. పాట ప్రసారానికి బ్రేక్ వేయాలని, దర్శక నిర్మాతలను చౌర్యం కేసులో అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఆంధ్రజ్యోతి, బెంగళూరు