Ride ona scooter : స్కూటర్ పై వన్నెలాడి
ABN , First Publish Date - 2023-01-14T01:37:24+05:30 IST
నానీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్ పూర్తయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు...

నానీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్ పూర్తయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేశ్ నటించారు. ఓ పాత బజాజ్ చేతక్ స్కూటర్‌ను కీర్తి సురేశ్ నడుపుతున్న స్టిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ‘దసరా’ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. తెలుగు సహా తమిళ. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. మరో పక్క ప్రమోషన్ వర్క్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, ఫొటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి.