రివర్స్‌ లవ్‌స్టోరీ

ABN , First Publish Date - 2023-06-13T04:01:38+05:30 IST

సూర్య శ్రీనివాస్‌, శివ బొమ్మరాజు, జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్‌’. (ఏ లవ్‌ స్టోరీ ఇన్‌ రివర్స్‌) . రామ్‌యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో...

రివర్స్‌ లవ్‌స్టోరీ

సూర్య శ్రీనివాస్‌, శివ బొమ్మరాజు, జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్‌’. (ఏ లవ్‌ స్టోరీ ఇన్‌ రివర్స్‌) . రామ్‌యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ర విశేషాలను రామ్‌యోగి వెల్లడిస్తూ ‘ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికరమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్‌, వైజాగ్‌లో షూటింగ్‌ జరిగింది. త్వరలో ఫస్ట్‌ లుక్‌ , టీజర్‌ విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడిటింగ్‌! విజయ్‌, సమర్పణ: తేడా బ్యాచ్‌ సినిమా.

Updated Date - 2023-06-13T04:01:38+05:30 IST