రేణూదేశాయ్‌కు అనారోగ్యం
ABN, First Publish Date - 2023-02-15T00:19:37+05:30
కొనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటి రేణూదేశాయ్ వెల్లడించారు. గుండె, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు...
కొనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటి రేణూదేశాయ్ వెల్లడించారు. గుండె, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మంగళవారం సోషల్ మీడియాలో రేణూదేశాయ్ తెలిపారు. తనలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో ధైర్యాన్ని పెంచడానికి ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ‘ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతూ, మంచి ఆహారం తీసుకుంటూ, యోగా చేస్తున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగ్స్‌కు హాజరవుతాను’ అని తెలిపారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మీపైనా, జీవితంపైనా ఆశను కోల్పోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఎప్పటికైనా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది’ అని చెప్పారు. రేణూదేశాయ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు.