కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండో పొలిమేర

ABN, First Publish Date - 2023-10-11T04:57:37+05:30

కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ‘మా ఊరి పొలిమేర’ చిత్ర విజయం నిరూపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2...

కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ‘మా ఊరి పొలిమేర’ చిత్ర విజయం నిరూపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ చితరం వస్తోంది. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘సత్యం’ రాజేశ్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల నటించారు. నవంబర్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా చూసి మెచ్చిన పంపిణీదారుడు వంశీ నందిపాటి పూర్తి హక్కులు కొని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత గౌరీకృష్ణ వెల్లడించి ‘మా సినిమా మొదటి పార్ట్‌ ఘన విజయం సాధించింది. అందుకే సెకండ్‌ పార్ట్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’ అన్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్‌ మిస్టరీకి బ్లాక్‌ మ్యాజిక్‌ జోడించి ఈ చిత్రం రూపొందిస్తున్నాం. మొదటి పార్ట్‌ కంటే సెకండ్‌ పార్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను ఈ చిత్రంలో జోడించాం. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్‌ చేశాం’ అని చెప్పారు దర్శకుడు డా. అనిల్‌ విశ్వనాథ్‌.

Updated Date - 2023-10-11T04:57:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!