ధనుష్‌తో సంబంధం అంటగట్టారు

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:08 AM

నటి మీనా భర్త విద్యాసాగర్‌ గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయుతే భర్త చనిపోయిన కొన్నాళ్లకే మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారు...

ధనుష్‌తో సంబంధం అంటగట్టారు

నటి మీనా భర్త విద్యాసాగర్‌ గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయుతే భర్త చనిపోయిన కొన్నాళ్లకే మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేశారు. అంతేకాకుండా కొంతమంది సహనటులతో ఆమెకు సంబంధం అంటగ ట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనా దీనిపై స్పందించారు. ‘హీరో ధనుష్‌తో నాకు సంబంధం అంటగట్టారు. ఇలాంటి వాటివల్ల నా కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తుందో వాళ్లు ఆలోచించుకోవాలి. ఇప్పట్లో నాకు మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. అలాగని జీవితాంతం ఒంటరిగా ఉంటానని కూడా చెప్పలేను’ అని మీనా స్పందించారు.

Updated Date - Dec 28 , 2023 | 01:08 AM