సీక్వెల్‌కు రెడీ!

ABN , First Publish Date - 2023-04-20T03:33:10+05:30 IST

‘అశ్లీలం మోతాదు ఎక్కువైంది’, ‘ఆ బూతులు ఏమిటి బాబోయ్‌’ అని విమర్శలు ఎన్ని వినిపించినా ‘రానా నాయుడు’ వెబ్‌ సీరిస్‌ సూపర్‌ హిట్‌ అయింది. మార్చి 10న స్ట్రీమింగ్‌ అయిన ఈ సిరీస్‌ టాప్‌ 10 సిరీ్‌సలో ఒకటిగా నిలిచింది...

సీక్వెల్‌కు రెడీ!

‘అశ్లీలం మోతాదు ఎక్కువైంది’, ‘ఆ బూతులు ఏమిటి బాబోయ్‌’ అని విమర్శలు ఎన్ని వినిపించినా ‘రానా నాయుడు’ వెబ్‌ సీరిస్‌ సూపర్‌ హిట్‌ అయింది. మార్చి 10న స్ట్రీమింగ్‌ అయిన ఈ సిరీస్‌ టాప్‌ 10 సిరీ్‌సలో ఒకటిగా నిలిచింది. వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరిస్‌ నెట్‌ఫిక్స్‌ వేదికగా విడుదలై అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్లింది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా తయారైన ‘రానా నాయుడు’ ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధమైంది. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీ్‌సకు విశేష ప్రజాదరణ లభించిందనీ, అందుకే ఇప్పుడు ‘రానా నాయుడు 2’ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామనీ నెట్‌ఫ్లిక్స్‌ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో మలుపులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు 2’ ఉంటుందని తెలిపింది. వెంకటేశ్‌, రానా తండ్రీ కొడుకులగా నటించిన ఈ వెబ్‌ సిరీ్‌సకు కరణ్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుందర్‌ అరోన్‌ నిర్మాత.

Updated Date - 2023-04-20T03:33:10+05:30 IST