రోలెక్స్ కోసం రెడీ
ABN , First Publish Date - 2023-08-14T00:46:32+05:30 IST
కమల్‌హాసన్ హీరోగా రూపొందిన ‘విక్రమ్’ చిత్రం క్లైమాక్స్‌లో డ్రగ్ మాఫియా డాన్ రోలెక్స్‌గా పాత్రోచిత నటనతో ఆకట్టుకున్నారు సూర్య. ఆ పాత్ర స్ఫూర్తితో...

కమల్‌హాసన్ హీరోగా రూపొందిన ‘విక్రమ్’ చిత్రం క్లైమాక్స్‌లో డ్రగ్ మాఫియా డాన్ రోలెక్స్‌గా పాత్రోచిత నటనతో ఆకట్టుకున్నారు సూర్య. ఆ పాత్ర స్ఫూర్తితో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయాన్ని సూర్య ధృవీకరించారు. ఆదివారం ఆయన అభిమానులను కలసిన సందర్భంలో దీనిపై స్పందించారు. ‘లోకేశ్ కనగరాజ్ రోలెక్స్ పాత్రపై కథ చెప్పారు. నాకు నచ్చింది. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభిస్తాం’ అన్నారు.