కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రిలీజ్‌కు రెడీ!

ABN, First Publish Date - 2023-10-20T02:39:01+05:30

సస్పెన్స్‌, క్రైమ్‌ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ జోడించి రూపొందించిన చిత్రం ‘అధర్వ’. కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన...

సస్పెన్స్‌, క్రైమ్‌ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ జోడించి రూపొందించిన చిత్రం ‘అధర్వ’. కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. మహేశ్‌రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. ‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని క్లూస్‌ టీమ్‌ విశిష్టతను, ప్రాముఖ్యతను చెబుతూ గ్రిప్పింగ్‌ కథనంతో ‘అధర్వ’ చిత్రం రూపుదిద్దుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా బాగా వచ్చింది. తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకూ విడుదల చేసిన టీజర్‌, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తాం’ అని దర్శకనిర్మాతలు చెప్పారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌.

Updated Date - 2023-10-20T02:39:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!