యాక్షన్‌కు సై
ABN , First Publish Date - 2023-11-14T04:39:35+05:30 IST
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘టైగర్ 3’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈచిత్రంలో కథానాయికగా నటించిన కట్రినా కైఫ్ నటనకు ప్రేక్షకులు ఫిదా...

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘టైగర్ 3’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈచిత్రంలో కథానాయికగా నటించిన కట్రినా కైఫ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అంటున్నారు. ముఖ్యంగా పోరాట ఘట్టాల్లో ఆమె నటన చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమాలో లేడీ విలన్‌కు కట్రినాకు మధ్య వచ్చే టవల్ ఫైట్ సినిమాకు ప్రత్యేకాకర్షణ అని చిత్రబృందం మొదటి నుంచీ చెబుతోంది. ‘టైగర్ 3’లోని అన్ని ఫైట్లలోనూ కట్రినా, సల్మాన్‌తో పోటాపోటీగా నటించి మెప్పించిందంటున్నారు అభిమానులు. పరిశ్రమ నుంచి కూడా కట్రినాకు ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ రోల్స్ కట్రినాకు కొత్త కాదు. గతంలో ‘టైగర్ జిందాహై, జిందగీ నా మిలేగీ దొబారా’ లాంటి చిత్రాల్లో పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలు చేశారు. అయితే అవన్నీ హీరో బేస్‌డ్ యాక్షన్ మూవీస్. ఇప్పుడు ‘టైగర్ 3’ చిత్రంలో యాక్షన్ రోల్‌లో కట్రినా సత్తా చాటడంతో మున్ముందు ఆమె లీడ్‌రోల్‌లో భారీ యాక్షన్ చిత్రాలు రూపొందించేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో కట్రినా కూడా యాక్షన్ మూవీ్‌సకు ఓకే చెప్పే అవకాశం ఉంది.