కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కౌంట్‌ డౌన్‌ మొదలైంది

ABN, First Publish Date - 2023-11-25T01:03:22+05:30

రవితేజ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగిల్‌’ చిత్రం విడుదలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రవితేజ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగిల్‌’ చిత్రం విడుదలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలయ్యే ఈ సినిమాకు సంబంధించి 50 డేస్‌ కౌంట్‌ డౌన్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రవితేజ తన ఎదురుగా ఉన్న టేబుల్‌ పై రకరకాల ఆయుధాలతో ఈ పోస్టర్‌లో కనిపించారు. ఇందులో ఆయన మల్టీ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు. కావ్య థాపర్‌ కథానాయిక. అనుపమ పరమేశ్వరన్‌ మరో హీరోయిన్‌గా నటించారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: దావ్‌ జాంద్‌, ఫొటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని, కమిల్‌ ప్లాకి, కర్క్‌ చావ్లా, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Updated Date - 2023-11-25T01:03:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!