కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హనుమంతుడికి రవితేజ డబ్బింగ్‌

ABN, Publish Date - Dec 28 , 2023 | 01:13 AM

తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్‌’. సూపర్‌హీరో జానర్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. జనవరి 12న విడుదలవుతోంది...

తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్‌’. సూపర్‌హీరో జానర్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. జనవరి 12న విడుదలవుతోంది. ‘హను-మాన్‌’ చిత్రంలో ‘కోటి’ అనే వానరం పాత్ర ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరించే ఈ వానరం పాత్రకు రవితేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఆయన గొంతుతో కోటి పాత్ర మరింత శక్తిమంతంగా మారిందని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ కథానాయిక. వినయ్‌రాయ్‌ విలన్‌గా నటిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 01:13 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!