Ravanasura is ready : రావణాసురుడు సిద్ధం
ABN , First Publish Date - 2023-02-27T02:07:36+05:30 IST
రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకుడు. సుశాంత్ కీలక పాత్రధారి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు...

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకుడు. సుశాంత్ కీలక పాత్రధారి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. అను ఇమ్మానియేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా కథానాయికలు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఓ గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. దీంతో షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘శ్రీకాంత్ విస్సా ఓ ఆసక్తికరమైన కథ అందించారు. దాన్ని సుధీర్ వర్మ ఊహించని మలుపులతో తీర్చిదిద్దాడు. రవితేజ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్.