సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వేసవిలో రావణాసుర

ABN, First Publish Date - 2023-01-27T04:59:41+05:30

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’.. ఇలా వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చేశారు రవితేజ. ఇప్పుడు ‘రావణాసుర’గా కొత్త అవతారం ఎత్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’.. ఇలా వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చేశారు రవితేజ. ఇప్పుడు ‘రావణాసుర’గా కొత్త అవతారం ఎత్తారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రవితేజ, అభిషేక్‌ నామా నిర్మాతలు. అను ఇమ్మానియేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్రధారి. గురువారం రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌ గ్లిమ్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్నమైన పార్శ్వాలున్న పాత్రలో కనిపించనున్నారు. లాయర్‌గా రవితేజ లుక్‌ ఆకట్టుకొంటోంది. ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రవితేజ పాత్ర ఇది వరకెప్పుడూ చూడని విధంగా ఉంటుందని, సుశాంత్‌ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ విస్సా కథ, మాటలు అందించారు. సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌.

Updated Date - 2023-01-27T04:59:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!