కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రష్మిక.. కట్రీనా.. ఇప్పుడు అలియా!

ABN, First Publish Date - 2023-11-28T06:05:03+05:30

మొన్న రష్మిక, నిన్న కాజోల్‌, కట్రీనా, సారా తండూల్కర్‌.. ఇప్పుడు అలియా.. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియాల...

మొన్న రష్మిక, నిన్న కాజోల్‌, కట్రీనా, సారా తండూల్కర్‌.. ఇప్పుడు అలియా.. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియాల జాబితా ఇలా చాంతాడులా పెరిగిపోతోంది. తాజాగా అలియా భట్‌ కు సంబందిచిన అసభ్యకరమైన వీడియా ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. ఇలాంటి వీడియోలు సర్క్యులేట్‌ చేస్తే కఠినంగా చర్చలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా సైబర్‌ క్రైమ్స్‌ ఆగడం లేదు. ఆ నేరస్తులు లక్ష్మపెట్డడం లేదు. డీప్‌ఫేక్‌ వీడియోలు తయారు చేసినా, వాటిని సర్క్యులేట్‌ చేసినా లక్ష రూపాయల పెనాల్టీతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని కేంద్రప్రభుత్వం ప్రకటించినా సైబర్‌ క్రైమ్‌ నేరస్తులు భయపడడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేరాలకు పాల్బడే వారిని అదుపు చేయడానికి త్వరలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించి వారం కూడా కాకముందే అలియా డీప్‌ పేక్‌ డీడియా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2023-11-28T06:05:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!