కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గర్ల్‌ఫ్రెండ్‌గా రష్మిక

ABN, First Publish Date - 2023-10-23T01:24:46+05:30

రష్మిక మందన్న ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది...

రష్మిక మందన్న ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్య కొప్పినేని, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ‘చి.ల.సౌ’, ‘మన్మథుడు 2’ ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌. సినిమాటోగ్రఫీ: కృష్ణన్‌ వసంత్‌

Updated Date - 2023-10-23T01:24:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!