రేంజ్‌ రోవర్‌లో బుట్టబొమ్మ

ABN , First Publish Date - 2023-10-26T01:48:11+05:30 IST

హిట్‌ చిత్రాల కథానాయికగా దశాబ్దకాలంపాటు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌తో కొనసాగారు పూజాహెగ్డే. అయితే కొంతకాలంగా తెలుగులో ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్నాయి...

రేంజ్‌ రోవర్‌లో బుట్టబొమ్మ

హిట్‌ చిత్రాల కథానాయికగా దశాబ్దకాలంపాటు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌తో కొనసాగారు పూజాహెగ్డే. అయితే కొంతకాలంగా తెలుగులో ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో ప్రయత్నించినా అక్కడా నిరాశే ఎదురైంది. తన కెరీర్‌ విషయం పక్కన పెడితే పూజాకు కార్లంటే మహా సరదా. ఇప్పటికే తన దగ్గర పోర్షే కయాన్‌, ఆడి క్యూ-7, జాగ్వార్‌లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో లగ్జరీ కారు చేరింది. దసరా పండుగ సందర్భంగా దాదాపు రూ. 4 కోట్ల విలువైన రేంజ్‌ రోవర్‌ కారును పూజా సొంతం చేసుకొన్నారు. కుటుంబంతో కలసి కొత్త కారుకు పూజలు చేయించారు. కారును చూస్తూ మురిసిపోతూ దిగిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోగా వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో షాహిద్‌కపూర్‌ సరసన ‘దేవా’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2023-10-26T01:48:11+05:30 IST