రెట్రోట్యూన్‌తో రంగమ్మ
ABN , First Publish Date - 2023-04-09T01:26:31+05:30 IST
చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫొటోస్ తీయబడును’ అనేది ఉపశీర్షిక...

చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫొటోస్ తీయబడును’ అనేది ఉపశీర్షిక. చందు ముద్ద దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించారు. ‘గుండె కాజేసి జెడ గంట కట్టావమ్మ...రంగమ్మా’ అంటూ సాగే తొలి గీతాన్ని నటుడు ప్రియదర్శి విడుదల చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస మౌళి రచించిన ఈ గీతాన్ని ఎస్పీ చరణ్ ఆలపించారు. ప్రిన్స్ హెన్రీ స్వరాలు అందించారు. రెట్రో ఫీలింగ్ అందిస్తూనే, ఇప్పటి జనరేషన్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంటుందని చైతన్యరావ్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ.