రామ్‌ ప్రేమ ప్రయాణం

ABN , First Publish Date - 2023-06-21T03:42:53+05:30 IST

ప్రముఖ దర్శకుడు కె. దశరథ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’. డీవై చౌదరి దర్శకత్వం వహిస్తూ దశరథ్‌తో కలసి నిర్మిస్తున్నారు. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్థనన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు...

రామ్‌ ప్రేమ ప్రయాణం

ప్రముఖ దర్శకుడు కె. దశరథ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’. డీవై చౌదరి దర్శకత్వం వహిస్తూ దశరథ్‌తో కలసి నిర్మిస్తున్నారు. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్థనన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచించే ఓ యువకుడు, అతన్నే తన సర్వస్వంగా భావించే యువతి... ఈ ఇద్దరి జీవితాలను ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పిందనే అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇదని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కె. దశరథ్‌ మాట్లాడుతూ ‘ ఈ నెల 30న మైత్రీ మూవీస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కథ, సంగీతం, వినోదం బావుంటాయి. సినిమా చూసినవాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోందని డివై చౌదరి తెలిపారు. ‘లవ్‌ యూ రామ్‌’ అందరినీ ఎంటర్టైన్‌ చేస్తుందని రోహిత్‌ అన్నారు.

Updated Date - 2023-06-21T03:42:53+05:30 IST