కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రామయ్యా.. వచ్చాడయ్యా!

ABN, First Publish Date - 2023-08-30T04:43:44+05:30

షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘జవాన్‌’ అన్ని హంగులూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక...

షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘జవాన్‌’ అన్ని హంగులూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. గౌరీ ఖాన్‌ నిర్మాత. సెప్టెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ‘నాట్‌ రామయ్యా వస్తావయ్యా’ పాటని విడుదల చేశారు. షారుఖ్‌, నయనతారలపై తెరకెక్కించిన ఈ పార్టీ గీతం హుషారుగా సాగిపోయింది. ముఖ్యంగా షారుఖ్‌ వేసిన ట్రెండీ స్టెప్స్‌ అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అనిరుథ్‌ స్వరాలు సమకూర్చారు. తెలుగు వెర్షన్‌ గీతాన్ని చంద్రబోస్‌ రాశారు. శ్రీరామ చంద్ర, రక్షిత సురేశ్‌, అనిరుథ్‌ పాడారు.

Updated Date - 2023-08-30T04:43:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!