Ram who raised expectations : అంచనాలు పెంచేసిన రామ్
ABN , First Publish Date - 2023-06-04T02:31:06+05:30 IST
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న పాన్ ఇండియా మూవీ పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న పాన్ ఇండియా మూవీ పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ‘ఫైనల్లీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం 24 రోజులు చిత్రీకరణ చేశాం. ఇది క్లైమాక్స్ కాదు .. క్లై ‘మ్యాక్స్’ అని హీరో రామ్ ట్వీట్ చేశారు. పతాక సన్నివేశాలను ‘మ్యాక్స్’ అంటూ ఆయన పేర్కొని అంచనాలు పెంచేశారు. రామ్ హుషారుకి, ఎనర్జీకి లిమిట్స్ ఉండవు. అలాగే బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికి కూడా లిమిట్స్ ఉండవు. వీరిద్దరూ కలసి చేస్తున్న సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తన ట్వీట్ ద్వారా హింట్ ఇచ్చారు రామ్. త్వరలో సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడించనున్నారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.