సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వైజాగ్‌లో రామ్‌చరణ్‌

ABN, First Publish Date - 2023-02-15T00:22:31+05:30

హీరో రామ్‌చరణ్‌, తమిళ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో రామ్‌చరణ్‌, తమిళ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. సింహగిరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. మంగళవారం ఉదయం వరహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా నాలుగో షెడ్యూల్‌లో భాగంగా ఈ పాటను విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామన్నారు. సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదనీ, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అలాగే సమంత కథానాయికగా దర్శకుడు గుణశేఖర్‌ రూపొందించిన ‘శాకుంతలమ్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్టు దిల్‌ రాజు తెలిపారు. కొత్త వారితో తను నిర్మిస్తున్న ‘బలగం’ షూటింగ్‌ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామనీ వెల్లడించారు.. మరో రెండు సినిమాలకు స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తిచేసినట్లు దిల్‌ రాజు వెల్లడించారు.

ఆంధ్రజ్యోతి (సింహాచలం)

Updated Date - 2023-02-15T00:22:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!