పురాణాల స్ఫూర్తితో..

ABN , First Publish Date - 2023-08-21T02:10:06+05:30 IST

‘రాక్షస కావ్యం’ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. సినిమాలో ఏదో కొత్తదనం ఉందని అర్థమవుతోంది’

పురాణాల స్ఫూర్తితో..

‘రాక్షస కావ్యం’ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. సినిమాలో ఏదో కొత్తదనం ఉందని అర్థమవుతోంది’ అని దర్శకుడు వేణు యెల్దండి అన్నారు. శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మించిన చిత్రమిది. నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టీజర్‌ను యూనిట్‌ ఇటీవలే విడుదల చేసింది. ఈ సందర్భంగా దాము రెడ్డి మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో ఒక భిన్నమైన ప్రయత్నం చేశాం. మంచి హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి’ అన్నారు. పురాణాల స్ఫూర్తితో అల్లుకున్న కాల్పనిక గాథతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పారు. నా జీవితాంతం గుర్తుండే సినిమా ఇదని నవీన్‌ చెప్పారు.

Updated Date - 2023-08-21T02:10:11+05:30 IST