సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాజమౌళి షేక్‌స్పియర్‌ని తలపించారు

ABN, First Publish Date - 2023-02-13T00:47:14+05:30

హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి రాజమౌళిని అభినందించారు. కామెరూన్‌ దర్శకత్వం వహించిన ‘టైటానిక్‌’ చిత్రం రీ రిలీజ్‌ అవుతోన్న సందర్భంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి రాజమౌళిని అభినందించారు. కామెరూన్‌ దర్శకత్వం వహించిన ‘టైటానిక్‌’ చిత్రం రీ రిలీజ్‌ అవుతోన్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తనకు బాగా నచ్చిందని, ఇప్పటికే రెండు సార్లు చూశానని కామెరూన్‌ చెప్పారు. రాజమౌళి టేకింగ్‌, కథలో భావోద్వేగాలను పండించిన తీరు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని కొన్ని అంశాలు ఆలోచింపజేశాయనీ, కథనం విషయంలో రాజమౌళి షేక్‌స్పియర్‌ను తలపించారని అభినందించారు. ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకలో రాజమౌళిని కలిసినప్పుడు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి వివరంగా మాట్లాడాలనుకున్నాను కానీ సమయం దొరకలేదు. ఈసారి వీలు చిక్కితే మరింత మాట్లాడాలనుందని’ కామెరూన్‌ అన్నారు.

Updated Date - 2023-02-13T00:47:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!