రాజ్‌తరుణ్ మరో యాక్షన్ హీరో అవుతాడు
ABN , First Publish Date - 2023-08-29T03:08:49+05:30 IST
రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎ్‌స.రవికుమార్ చౌదరి దర్శకత్వం-లో రూపుదిద్దుకున్న ‘తిరగబడరా సామీ’ చిత్రం టీజర్‌ను సోమవారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు...

రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎ్‌స.రవికుమార్ చౌదరి దర్శకత్వం-లో రూపుదిద్దుకున్న ‘తిరగబడరా సామీ’ చిత్రం టీజర్‌ను సోమవారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘దర్శకుడు రవి మాకు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు. రాజ్‌తరుణ్ అద్భుత నటుడు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే అండర్ ప్లే పాత్ర చేసి పైనల్‌గా తిరగబడరా సామీ అని క్లైమాక్స్‌లో ఇరగదీసినట్లు అర్థమవుతోంది. ఫుల్ మాస్ సినిమా లా ఉంది. చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘నాలో కొత్త కోణాన్ని దర్శకుడు రవికుమార్ చౌదరిగారు చూపించారు. చిన్న చిన్నగా తప్పితే నేనెప్పుడూ యాక్షన్ సీన్లు చేయలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది.’ అన్నారు రాజ్‌తరుణ్. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ‘కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నాకు మళ్లీ రీ బర్త్ ఇస్తున్న నిర్మాత శివకుమార్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాతో రాజ్‌తరుణ్ మరో యాక్షన్ హీరో అవుతాడు’ అన్నారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘దిల్ రాజుగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన టీజర్ ల్బాచ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రవికుమార్ కథను ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తీశారు. నేను చేసిన చిత్రాల్లో ‘సూర్య వర్సెస్ సూర్య’ నా మనసుకి దగ్గరైన చిత్రం. ఆ టీమ్‌తో మరో పది సినిమాలు తీయడానికైనా నేను రెడీ. అలాగే ‘తిరగబడరా సామీ’ టీమ్‌తో కూడా మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మకర్‌దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు మరో ఎస్సెట్. అలాగే మన్నారా చోప్రా పాత్ర కూడా కీలకంగా ఉంటుంది’ అన్నారు. చిత్రంలో నెగెటివ్ రోల్ చేసినట్టు మన్నారా చోప్రా చెప్పారు.