పురుషోత్తముడి కథ

ABN , First Publish Date - 2023-05-02T00:21:16+05:30 IST

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘పురుషోత్తముడు’. హాసిని సుధీర్‌ కథానాయిక. రామ్‌ భీమన దర్శకుడు. రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

పురుషోత్తముడి కథ

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘పురుషోత్తముడు’. హాసిని సుధీర్‌ కథానాయిక. రామ్‌ భీమన దర్శకుడు. రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సి.కల్యాణ్‌ క్లాప్‌నిచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆకతాయి తరవాత నేను చేస్తున్న సినిమా ఇది. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. మంచి టీమ్‌ కుదిరింది. జూన్‌ 1 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌, రాజమండ్రి, కేరళలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ’’న్నారు. సంగీతం: గోపీ సుందర్‌.

Updated Date - 2023-05-02T00:21:37+05:30 IST