వివాదంలో రెహమాన్‌

ABN , First Publish Date - 2023-11-14T04:24:22+05:30 IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘పిప్పా’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దివంగత బెంగాలీ కవి కాజీ నజ్రుల్‌ ఇస్లాం...

వివాదంలో రెహమాన్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘పిప్పా’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దివంగత బెంగాలీ కవి కాజీ నజ్రుల్‌ ఇస్లాం రచించిన దేశ భక్తి గీతం ‘కరార్‌ ఓయ్‌ లౌహో కోపట్‌’ను వాడుకున్నారు. అయితే రెహమాన్‌ ఈ గీతం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మార్పులు చేసి తన సినిమాకు వాడుకున్నారని నజ్రుల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘రెహమాన్‌ అడగడంతో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ గీతాన్ని సినిమాలో వాడుకునేందుకు అనుమతించాం. కనీసం టైటిల్స్‌లో మాకు కృతజ్ఞతలు చెప్పలేదు. కానీ ఆయన ఒరిజినల్‌ట్యూన్‌ను మార్చారు. పాట ఆత్మను చంపేశారు. వెంటనే ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి’ అని నజ్రుల్‌ మనవడు అనిర్భన్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-14T04:24:23+05:30 IST