కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

15 నుంచి మళ్లీ లకలకలక

ABN, First Publish Date - 2023-09-04T00:25:33+05:30

పదిహేడేళ్ల క్రితం చంద్రముఖి తను బందీగా ఉన్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది...

పదిహేడేళ్ల క్రితం చంద్రముఖి తను బందీగా ఉన్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అందుకోసమే వచ్చేస్తోంది. అదెప్పుడు, ఎక్కడ, ఎలా.. అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 15 వరకూ ఆగాల్సిందే అంటున్నారు ‘చంద్రముఖి 2 దర్శకనిర్మాతలు. రాఘవ లారెన్స్‌ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన భారీ బడ్జెట్‌ చిత్రమిది. సీనియర్‌ డైరెక్టర్‌ పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ నిర్మించారు. వినాయకచవితి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 15న ‘చంద్రముఖి 2’ విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను వెంకట్‌ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని హారర్‌, థ్రిల్లింగ్‌, కామెడీ అంశాలను ట్రైలర్‌లో చూపించారు.

Updated Date - 2023-09-04T00:25:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!